పీఎస్ఎల్వీ సీ49 ప్రయోగం విజయవంతం

10 ఉప‌గ్ర‌హాల‌నుక‌క్ష్య‌లోకి ప్ర‌వేశ‌పెట్టిన శాస్త్ర‌వేత్త‌లు

నెల్లూరు: శ్రీ‌హ‌రి కోట‌లోని స‌తీష్ ధావ‌న్ స్పేస్ సెంట‌ర్ షార్ నుంచి పీఎస్ఎల్వీ సీ49 రాకెట్ విజ‌య‌వంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. పీఎస్ఎల్వీ సీ49 వాహ‌క‌నౌక ద్వారా 10 ఉప‌గ్ర‌హాల‌ను శాస్త్ర‌వేత్త‌లు నిర్ణీత క‌క్ష్య‌లోకి ప్ర‌వేశ‌పెట్టారు. పీఎస్ఎల్వీ సీ49 రాకెట్ ద్వారా ఈ శాటిలైట్ల‌ను ప్ర‌యోగించారు. 575 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న క‌క్ష్య‌లోకి శాటిలైట్ల‌ను ప్ర‌వేశపెట్టారు. ఇస్రోకు చెందిన EOS-01తో పాటు విదేశాల‌కు చెందిన 9 ఉపగ్ర‌హాల‌ను విజయవంతంగా ప్ర‌యోగించారు. పీఎస్ఎల్వీ సీ49 ప్ర‌యోగం విజ‌య‌వంతంపై ఇస్రో చైర్మ‌న్ శివ‌న్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ప్ర‌యోగం స‌ఫ‌లీకృతం చేసిన ఇస్రో శాస్త్ర‌వేత్త‌ల‌ను ఆయ‌న అభినందించారు.

 

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహ‌రికోట నుంచి ఇవాల (శ‌నివారం) మొద‌ట‌గా 3.02 నిమిషాల‌కు ప్ర‌యోగించాల‌ని భావించిన శాస్త్ర‌వేత్త‌లు ప‌ది నిమిషాలు ఆల‌స్యంగా 3.12 నిమిషాల‌కు పీఎస్ఎల్వీ సీ49 రాకెట్ ప్ర‌యోగించారు. రాకెట్‌ నింగికి నిప్పులు చెరుగుతూ దూసుకెళ్లింది. ఈ రాకెట్‌తో ఈఓఎస్‌-1 శాటిలైట్‌తో పాటు మ‌రో 9 క‌స్ట‌మ‌ర్ శాటిలైట్లను నింగిలోకి ప్రవేశపెట్టారు. పీఎస్ 1 ప‌ర్ఫార్మెన్స్ నార్మ‌ల్‌గా సాగింది. పీఎస్‌2 కూడా నార్మ‌ల్‌గా కొన‌సాగింది. పేలోడ్ ఫేరింగ్ కూడా అనుకున్న‌ట్లే స‌ప‌రేట్‌ అయ్యింది. పీఎస్ఎల్వీ బ‌రువు 290 ట‌న్నులు. అన్ని ద‌శ‌లు అనుకున్న రీతిలో పూర్తి అయ్యాయి. తొమ్మిది ఉప‌గ్ర‌హాల్లో అమెరికా, ల‌గ్జంబ‌ర్గ్‌, లుథివేనియా దేశాల‌కు చెందిన ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చారు ఇస్రో శాస్త్రవేత్తలు. అమెరికాకు చెందిన లీమ‌ర్ ఉప‌గ్ర‌హాలను.. మ‌ల్టీ మిష‌న్ రిమోట్ సెన్సింగ్ కోసం వినియోగించ‌నున్నారు. ల‌గ్జంబ‌ర్గ్‌కు చెందిన శాటిలైట్ల‌ను మారిటైమ్ అప్లికేష‌న్ల కోసం వాడ‌నున్నారు. టెక్నాల‌జీ డెమానిస్ట్రేష‌న్ కోసం లుథివేనియా ఉప‌గ్ర‌హాలు వినియోగించ‌నున్న‌ట్లు ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.