ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకు రూ. 2లక్షల స్కాలర్‌షిప్..

హైదరాబాద్(CLiC2NEWS): ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంస్థ (AICTE) బిటెక్ చదివే విద్యార్థులకు రూ. 2లక్షల స్కాలర్‌షిప్‌ను అందజేయనున్నారు. పేద విద్యార్థులు, దివ్యాంగులు, అనాథలు, అమర జవాన్ల విద్యార్థులకోసం పలు రకాల స్కాలర్‌షిప్‌లను అందజేయనున్నది. అర్హత గలిగిన విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌ల కోసం ఎన్ ఎస్‌పి లేదా ఎఐసిటిఈ వెబ్‌సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన విద్యార్థులకు సంవత్సరానికి రూ. 50వేల చొప్పున రూ. 2లక్షల స్కాలర్‌షిప్ పొందవచ్చు.