మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీ..
ఎపిపిఎస్సి నోటిఫికేషన్

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో మాహిళాభివృద్ధి, శిశు సంక్షేమ విభాగంలో ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి ఎపిపిఎస్సి నోటిఫికేషన్ విడుదలచేసింది. మొత్తం పోస్టులు 22, హోంసైన్స్, ఫుడ్ సైన్స్, న్యూట్రిషన్, సోషల్ వర్క్ తదితర విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులైన మహిళలు అర్హులు. ఆన్‌లైన్ విధానం(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్)లో జరిగే రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక నిర్వహిస్తారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకొనేందుకు చివరి తేది డిసెంబర్ 8,2021.
- ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, అప్లైడ్ న్యూట్రిషన్ అండ్ పబ్లిక్ హెల్త్, క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డైటిటిక్స్, ఫుడ్ సైన్సెస్ అండ్ క్వాలిటీ కంట్రోల్, ఫుడ్ సైన్సెస్ అండ్ మేనేజ్‌మెంట్, ఫుడ్ టెక్నాలజీ అండ్ న్యూట్రిషన్, ఫుడ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ సబ్జెక్ట్‌లలో ఏదో ఒకటి గ్రూప్ సబ్జెక్ట్‌గా బీఎస్సీ (బీజెడ్‌సీ) ఉత్తీర్ణత ఉండాలి.
2. హోంసైన్స్/సోషల్ వర్క్/సోషియాలజీ/ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్‌లో ఉన్నత విద్య అర్హతలు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
అభ్యర్థుల వయస్సు జూలై 1, 2021 నాటికి 18–42 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల మేరకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ https://psc.ap.gov.in/ చూడగలరు.