Nagarjuna Sagar: `సాగ‌ర్` 22 గేట్లు ఎత్తి నీటి విడుద‌ల‌

నాగార్జున సాగ‌ర్ (CLiC2NEWS): ఇటీవ‌ల కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు నాగార్జున సాగ‌ర్‌కు వ‌ర‌ద ఉద్ధృతి ఎక్కువైంది. సాగ‌ర్‌లోకి వ‌ర‌ద ప్ర‌వాహం భారీగా కొన‌సాగుతుండ‌టంతో అధికారులు ప్రాజెక్టు 22 గేట్లు ఎత్తి నీటిని దిగువ‌కు విడుద‌ల చేశారు. సాగ‌ర్ పూర్తి స్థాయి నీటిమ‌ట్టం 590 అడుగులు కాగా.. ప్ర‌స్తుతం 587 అడుగుల నీటి మ‌ట్టానికి చేరింది.

శ్రీ‌శైలం గేట్లు ఎత్తివేసి నీటిని దిగువ‌కు విడుద‌ల చేయ‌డంతో సాగ‌ర్‌కు వ‌ర‌ద ఉధృతి పెరిగింది. దాంతో అధికారులు ప్రాజెక్టు 22 గేట్ల ను ఎత్తి వేసి నీటిని దిగువ‌కు వ‌దిలారు. దాంతో సుంద‌ర‌మైన దృశ్యం ఆవిష్కృత‌మైంది. సాగ‌ర్ స్పిల్వే ద్వారా 1.71 ల‌క్ష‌ల క్యూసెక్కుల నీరు విడుద‌ల‌వుతోంది. సాగ‌ర్ అందాల‌ను చూసేందుకు సంద‌ర్శ‌కులు భారీగా త‌ర‌లి వ‌స్తున్నారు. దాంతో సాగ‌ర్ దారుల‌కు వాహ‌నాల తాకిడి ఎక్కువైంది.

 

Also Read: ఇండిగో విమానానికి త‌ప్పిన ప్ర‌మాదం..

Leave A Reply

Your email address will not be published.