`అనంత`లో గొంతు కోసుకొని యువతి ఆత్మహత్య..!

రొద్ద: అనంతపురం జిల్లాలో యువతి గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన చోటుచేసుకుంది. రొద్ద మండలం షాపురం గ్రామానికి చెందిన ఓ యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో కత్తితో గొంతు కోసుకుంది. చుట్టుపక్కల వారు యువతిని చికిత్స నిమిత్తం పెనుగొండ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. చివరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.