ఒక్కమాట అంటూ లక్ష ఆలోచనలను రేకెత్తించేదే CLiC2NEWS..

“నాలుగు దిక్కులు నావేనని.. ఒక్క దృక్కోణమేలనోయి..
పలు దృక్పధాలు మనవోయి.. పరిపరివిధాల ప్రపంచ కిటికీలు తెరువోయి..“
CLiC2NEWS ఈ కొత్త భావాల్ని భుజానమోస్తూ అరచేతిలో అద్భుతాలను పెడుతున్నది.

చూపుడు వేలు స్పష్టత చిహ్నమై వార్తా సమాహారమవుతున్నది.. పడమర, తూర్పు, ఉత్తర, దక్షిణాలు భూగోళపు గుర్తులు.. ఎల్లలు లేని లోకప్రవృత్తి హృదయవీణలను మీటమంటున్నది CLiC2NEWS.

తనదైన ముద్రతో ‘no favour, no fear’ అనే సూత్రాలపై నడుస్తున్నది. సూత్రప్రాయంగా సమవీక్షణం చేయిస్తున్నది. సర్వకాల సర్వావస్థల్లోనూ బి అలర్ట్ అంటూ జాతీయ, అంతర్జాతీయ వేదికగా నిలుస్తున్నది.

నిన్నను మరచిపోకుండా, రేపటి బ్రతుకును ఊహిస్తూ.. ప్రస్తుతంలో జీవించే మార్గమేదో సూచిస్తున్నది. దోహదమేదో, దోపిడీ ఏదో.. వ్యాపార విశేషాలుగా మీ ముందు కుప్పబోస్తున్నది. ‘CLiC2NEWS’అంటేనే ప్రపంచాన్ని దోసిటబట్టే వార్తా సమాహార పాత్ర వంటిదవుతున్నది.

చదవడం అలవాటైతే మానడం మీ చేతనవ్వదు.. నిబద్ధత, నిర్ధుష్టత అరవ ప్రాణంగా నిలుస్తుంది. నిత్యం మనుషుల ప్రాపంచిక క్రీడా విశేషాలను చూపినట్లే ప్రపంచ క్రీడా వేశేషాలను చెప్తుంది.

కంటికి ఇంపయితే… హృదయానికి ఇంపవుతుందన్న సత్యాన్ని ‘CLiC2NEWS’ ఎప్పుడో పసిగట్టింది. అందుకే క్లిక్2`సిత్రం` అనే బొ్మ్మగా రూపుకట్టింది. చూసి తరించడమే మీ పని. ఆలోచనలు రేకెత్తించే కార్టూన్లు ఇస్తూనే, ఆనందాన్ని పంచే సినీ మాయలోకాన్ని మీ ముందుంచుతుంది. సంప్రదాయవాదుల కల్పతరువై వారఫలాలు, పంచాంగం అందించే ప్రయత్నం చేస్తున్నది.

సార్వకాలీన వస్తువైవిధ్యంలో సాహిత్యం కూడా CLiC2NEWS స్వాగతిస్తుంది. కథలు,కవితలుగా మీకు దోసిలిబడుతుంది. తర్కవితర్కాల జీవితం కదా ఆధ్యాత్మికంగానూ, శాస్త్రీయంగానూ ఆదర్శమైన విషయాలను మీ ముందు ఉంచుతుంది. వార్తలో జగం వర్ధల్లుతున్నదన్న సత్యాన్ని అంతర్జాల స్వరూప విజ్ఞానాన్ని అందిపుచ్చుకుని మీ అందరికి నచ్చే రీతిలో తెలుగు లోగిలిని తన చిరునామా చేసుకున్నది మీ కోసం!

మీ అభిప్రాయాల్ని అమూల్యమైనవిగా నిర్వచించుకొని, ఆదర్శాన్ని తనది చేసుకొని, సమాజశ్రేయస్సుకోసం CLiC చేయమంటున్నది CLiC2NEWS.

రాజకీయాలు, విద్య, వైజ్ఞానిక, సామాజిక రంగాల అభివృద్ధి కోసం అన్యాయాన్ని ఎదురించే గొతుక మీది చేసుకోమంటూ తన వంతు కృషి చేస్తున్నది CLiC2NEWS.