అరబిందో ఫార్మాలో అర్ధరాత్రి చెల‌రేగిన మంట‌లు

హత్నూర: సంగారెడ్డి జిల్లాలోని హత్నూర మండలం గుండ్లమాచునూర్‌లో ఉన్న అరబిందో ఫార్మా తొమ్మిదో యూనిట్‌లో ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. స్థానికులు, కార్మికుల సమాచారం ప్రకారం.. పరిశ్రమలోని కాలం బ్లాక్ వద్ద అర్థ‌రాత్రి స‌మ‌యంలో ప్రాంతంలో ప్రమాదవశాత్తు షార్ట్‌సర్క్యూట్‌ జరిగింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగ‌డంతో దట్టమైన పొగలు అలముకున్నాయి. దీంతో విధుల్లో ఉన్న కార్మికులు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. ఫైరింజన్లు మంటలను ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ మంటలు అదుపులోకి రాలేదని స్థానికులు తెలిపారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.