అలనాటి నటుడు డా.ప్రభాకర్ రెడ్డి

మన సినిమా నటులు డాక్టర్ కావాలనుకుని యాక్టర్ అయ్యాను అని అంటుంటారు. కాని డాక్టర్ అయిన తరువాతే ప్రభాకర్ రెడ్డి యాక్టర్ అయ్యారు ప్రభాకరరెడ్డి, సూర్యాపేట జిల్లా, తుంగతుర్తిలో లక్ష్మారెడ్డి, కౌసల్య దంపతులకు 1935 అక్టోబర్ 8న జన్మించాడు. అతని సోదరుడు హైదరాబాద్ బంజారాహిల్స్ లో లాయర్గా ఉన్నాడు. ప్రభాకర్రెడ్డి ఇంటిపేరు మందడి. వీరు విద్యాభ్యస దశలోనే స్వాతంత్ర పోరాటయోధులతో కలసి బుర్రకథలదళంతో జతకలిసాడు. వీరి సమీప బంధువు ఉప్పునూతల పురుషోత్తమరెడ్డి గారు గొప్పధనవంతుడు. తర్వత కాలంలో మంత్రిగా కూడా పనిచేసారు. వీరు మంజీరా ఫిలింమేకర్స్ బేనర్‌పై గుత్తా రామినీడు దర్శకతత్వంలో ‘చివరకుమిగిలేది'(1960)అనే సినిమా తీసారు. ఆసినిమా అంతా హాస్పిటల్ కేంద్రంగా ఉంటుంది. ఆసినిమాలో అతికీలకమైన డాక్టర్ పాత్ర ప్రభాకరరెడ్డి చేతచేయించారు.
మద్రాసుచేరిన ప్రభాకర్రెడ్డి, నందమూరివారితో ఉన్నపరిచయంతో ‘భీష్మ’ (1962)చిత్రంలో ‘శంతనుడి’పాత్రలభించింది. ‘పాండవవనవాసంస (1965) ‘నర్తనశాల'(1963)’శ్రీకృష్టపాండవవీయం'(1966)’దానవీరశూరకర్ణ (1977) ‘శ్రీమద్విరాటపర్వంస (1979)స శ్రీకృష్టావతారం (1967) ‘శ్రీకృష్ణవిజయం (1971) ‘శ్రీకృష్ణార్జునయుధ్ధం'(1963) ‘రక్తసంబంధం'(1962) ‘అన్నదమ్ములఅనుబంధం'(1975) ‘నాదేశం'(1982) ‘అగ్నిపర్వతం'(1985) ‘అల్లూరిసీతారామరాజు'(1974) ‘మహామంత్రితిమ్మరుసు'(1962) ‘పల్నాటియుధ్ధం'(1966) ‘చిన్నకోడలు'(1952) ‘ఏడంతస్తులమేడ'(1980) ‘బొబ్బిలియుధ్ధం'(1964)’పునర్జన్న'(1963) ‘కల్పన’1977) నకిలీమనిషి'(1980) ‘మండలాధ్యక్షడు’చిత్రానికి దర్శకత్వం నిర్వహించారు. మనుషులుమమతలు'(1965)’ఉయ్యాలజంపాల'( 1965)’ప్రేమాభిషేకం’ (1981)అలా చిత్రసీమలో స్ధిరపడ్డారు. చివరకు మిగిలేదికో-డైరెక్టర్లక్ష్మీనారాయణ తెలంగాణా వాడే కనుక ‘లక్ష్మిదీపక్’అనిపేరు మార్చిఅతన్ని తనవద్దే ఉంచుకుని కొంతకాలానికి తనునిర్మాతగా మారి అతన్ని దర్మకుడిని చేసారు.అలా’ కార్తికదీపం’ ‘పండంటికాపురం’ (1972) ‘గృహప్రవేశం'(1982) ‘గాంధీపుట్టినదేశం (1973) ‘పచ్చనిసంసారం'(1970)వంటి పలుచిత్రాలు నిర్మించారు. అలాఇరవైకిపైగా చిత్రాలకు రచనలు చేసారు. లలితారాణిగా ఉన్నఆమె పేరును ‘జయప్రదసగా మార్చారు. తెలుగు చిత్రపరిశ్రమ హైదరాబాద్‌కు తరలిరావడంతో తనూహైదరాబాద్‌కు మకాం మార్చారు. నటుడిగా అయిదువందల చిత్రాలకు చేరురువగా వచ్చారు. తనమిత్రుడునటుడు సారధి, దర్శకుడు భాస్కరరావు, నటుడుగుమ్మడి, ప్రోడక్షన్సత్తిరాజు వంటిమరికొందరు సేవాభావం కలవారిని కలుపుకుని ‘టిన్సీకల్చరల్సెంటర్’నెలకొల్పారు. అక్కడికివచ్చే వారికిపగటిపూట ఉచితభోజనం పెట్టెవారు. అప్పుడే పేదకళాకారులకు ఫెంక్షన్ఏర్పాటుచేసారు. అదినేటికి కొనసాగుతుంది.
కళాకారులకు హౌసింగ్ సోసైటీ ఏర్పాటుచేయడంలో వీరిదిప్రముఖపాత్రఉంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో స్టూడియోలు నిర్మించడం.. సినిమా హాల్స్ కట్టడం లాంటివి చేసారు. అలాంటి సమయంలో ప్రభాకర రెడ్డి మాత్రం పేద సినీ కళాకారుల కోసం తన 10 ఎకరాల పొలం ఇచ్చేసారు. అది కూడా ఉచితంగా.. అలా కట్టుకున్న కాలనీనే ఇప్పుడు చెప్పుకుంటున్న చిత్రపురి కాలనీ. అందుకే దానికి ప్రభాకర రెడ్డి చిత్రపురి కాలనీ అంటారు.
ఇక్కడ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నాడు ఆయన 10 ఎకరాలను దానం చేసాడు. అందుకనే హైదరాబాదు లోని మణికొండలో ఈయన స్మారకార్ధం డా. ప్రభాకరరెడ్డి చలనచిత్ర కార్మిక చిత్రపురికి ఈయన పేరుపెట్టారు. అన్నిరకాలపాత్రలుచేసి మెప్పించిన వీరు 1997 లో శాశ్వితనిద్రలో ఒరిగిపోయారు.
-డా.బెల్లంకొండనాగేశ్వరరావు