అసోం సిఎంగా హిమంత బిశ్వశర్మ!

గౌహ‌తి: అస్సాం కొత్త సిఎంగా హిమంత బిశ్వ శ‌ర్మ ప్ర‌మాణం చేయ‌నున్నారు. భార‌తీయ జ‌న‌తా పార్టీ లెజిస్లేటివ్ పార్టీ లీడ‌ర్‌గా హిమంత‌ను ఎన్నికైన‌ట్లు కేంద్ర మంత్రి, బీజేపీ నేత న‌రేంద్ర సింగ్ తోమార్ వెల్ల‌డించారు. ఆదివారం బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ స‌మావేశాన్ని నిర్వ‌హించారు. బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మను బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. దీనికి బీజేపీ ప‌రిశీల‌కులుగా తోమార్‌తోపాటు బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అరుణ్ సింగ్ కూడా హాజ‌ర‌య్యారు. ఈ స‌మావేశం సంద‌ర్భంగా సీఎం రేసులో ఉన్న స‌ర్బానంద సోనోవాలే.. హిమంత బిశ్వ శ‌ర్మ పేరును ప్ర‌తిపాదించారు. మరో వైపు అసోం సీఎం సర్బానంద సోనోవాల్ రాజీనామా చేశారు. గవర్నర్‌కు తన రాజీనామా లేఖను సమర్పించారు.

ఇక సీఎంగా ఎన్నికైన బిశ్వ శర్మ అస్సామీ బ్రాహ్మణుడు. ఈశాన్య ప్రజాస్వామ్య కూటమి కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. అస్సాంలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నాయకత్వం ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది ప్రకటించలేదు. అస్సాంలో 126 అసెంబ్లీ సీట్లుండగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 60 సీట్లు గెలుచుకుంది. దాని మిత్రపక్షాలైన ఏజీపీ 9, యూపీపీఎల్‌ 6 సీట్లు దక్కించుకున్న సంగతి తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.