ఆగి ఉన్న బ‌స్సును ఢీకొన్న కారు..

భీమ‌డోలు: పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు రైల్వే స్టేషన్ ద‌గ్గ‌ర‌లోని జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సును ఇన్నోవా కారు వెనక నుండి ఢీకొంది. తాడేపల్లిగూడెం వైపు నుంచి ఏలూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు భీమడోలు వద్ద ప్రయాణికుల ఎక్క‌డానికి బస్ స్టాప్ వ‌ద్ద‌ ఆగిఉంది. అది గ‌మ‌నించ‌కుండా వెనక నుంచి వచ్చిన ఇన్నోవా కారు ఆర్టీసీ బస్సును వెనుక నుండి బ‌లంగా ఢీకొంది. దీంతో ఇన్నోవా కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా మరో ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి త‌ర‌లించారు. త‌రువాత మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు.

Leave A Reply

Your email address will not be published.