ఆధార్ అడ‌గొచ్చు.. తెలంగాణ స‌ర్కార్‌..

ద‌ర‌ణిలో ఆస్తుల న‌మోదుపై హైకోర్ట‌లో విచార‌ణ‌

హైద‌రాబాద్‌: ద‌ర‌ణి పోర్ట‌ల్లో ఆస్తుల న‌మోదుపై హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది. వ్య‌వ‌సాయేత‌ర ఆస్తుల రిజిస్ట్రేష‌న్ల‌పై న‌వంబ‌ర్ 3న ఉన్న‌త న్యాయ‌స్థానం స్టే విధించిన విష‌యం తెలిసిందే. సాగుభూముల య‌జ‌మానుల ఆధార్‌, కుల వివ‌రాల‌కు ఒత్త‌డి చేయొద్ద‌ని స్టే విధించిన సంద‌ర్భంగా కోర్టు పేర్కొంది. ఈ నేప‌థ్యంలో స్టేను ఎత్తివేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం హైకోర్టును కోరింది. ఈ మేర‌కు వెకేట్ పిటిష‌న్ దాఖ‌లు చేసింది.  సాగుభూముల‌పై స‌బ్సిడీ ప‌థ‌కాలు అమ‌ల్లో ఉన్నందున ఆధార్ వివ‌రాలు అడ‌గొచ్చ‌ని ప్ర‌భుత్వం ఉన్న‌త న్యాయ‌స్థానం దృష్టికి తీసుకెళ్లింది. ఆధార్‌ను గుర్తింపు కార్డుగా ప‌రిగ‌ణించ‌వ‌చ్చంటూ చట్టం పేర్కొంటున్న విష‌యాన్ని తెలిపింది. దీనిపై స్పందించిన హైకోర్టు ప్ర‌భుత్వం దాఖ‌లు చేసిన వేకేట్ పిటిష‌న్‌పై అభ్యంత‌రాల‌ను ఈ నెల 31 లోపు స‌మ‌ర్పిచాల‌ని పిటిష‌న‌ర్ల‌కు సూచించింది. అనంత‌రం ధ‌ర‌ణి పిటిష‌న్ల‌పై విచార‌ణ‌ను ఈ నెల 31కి వాయిదా వేసింది.

Leave A Reply

Your email address will not be published.