ఆమ్లేట్‌ వేయలేదని ఉరేసుకున్న భ‌ర్త

ఆదిలాబాద్: జిల్లాలోని తానూరు మండలంలోని ఉమ్రి(కే) గ్రామానికి చెందిన గంగాధరోల్ల యోగేశ్‌(32) భార్య ఆమ్లేట్‌ వేయలేదని ఉరేసుకొని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ‌త కొంత కాలంగా విప‌రీతంగా తాగుడుకు బానిసైన యోగేశ్‌ గురువారం ఫూటుగా మద్యం తాగి ఇంటికి వచ్చి ఆమ్లేట్‌ వేయమని భార్యను అడిగాడు. శివరాత్రి పండుగ ఉందని వద్దని ఆమె సూచించింది. దీంతో భార్యను కొట్టడంతో ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఆ తర్వాత యోగేశ్‌ ఇంట్లోనే తాగిన మైకంలో తాడుతో దూలానికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య భాగ్యశ్రీ ఇంటికి వచ్చి చూసే సరికి విగతజీవిగా కనిపించాడు. కాగా యోగేశ్‌కు కొడుకు, కూతురు ఉన్నారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లాన్ని సంద‌ర్శించారు. కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.