ఆ విషాదంపై రతన్ టాటా భావోద్వేగం

ముంబయి: టాటా గ్రూపు గౌరవ ఛైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా 12 ఏళ్ల నాటి ఉగ్రదాడిని గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ముంబై నగరంలో నవంబరు 26న చోటుచేసుకున్న మారణహోమంపై సోషల్ మీడియాలో గురువారం స్పందించారు. ఈ సందర్భంగా ఉగ్రవాద దాడిలో అసువులు బాసిన అమరవీరులకు, ప్రజలకు రతన్ టాటా నివాళులర్పించారు.
తాజ్‌మహల్ ప్యాలెస్ హోటల్ ఫోటోను పోస్టు చేసి.. ఆ విధ్వంసాన్ని మరిచిపోలేమని అన్నారు. వందేళ్ల క్రితం నాటి తాజ్‌మహల్ హోటల్‌పై 12 ఏళ్ల క్రితం ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ తాజ్ హోటల్ ఓనర్ టాటా గ్రూపే. అయితే ఉగ్రవాదాన్ని ఓడించేందుకు ముంబై ప్రజలు చూపిన తెగువను, సాహసాన్ని రతన్ టాటా మెచ్చుకున్నారు. ముంబై ప్రజలు ఆ రోజు ప్రదర్శించిన సున్నితత్వం భవిష్యత్తులోనూ ప్రజ్వరిల్లుతుందన్నారు. ఉగ్రవాదులు దాడి చేసిన కొన్ని నెలల తర్వాత మళ్లీ తాజ్ హోటల్‌ను రిపేర్ చేశారు. ఆ రోజు జరిగిన దాడిలో ఆ హోటల్‌లోనే 31 మంది మరణించారు.
— Ratan N. Tata (@RNTata2000) November 26, 2020