కోటి మంది ఫాలోవర్లు..

చిత్రసీమలోకి అడుగుపెట్టిన అనతికాలంలోనే స్టార్ హీరోల స్థాయికి చేరుకున్న కథానాయకుడు విజయ్ దేవరకొండ.‘వాట్సప్.. వాట్సప్ మై రౌడీస్’ అని అభిమానులను ప్రేమగా అంటుంటాడు విజయ్ దేవరకొండ. అభిమానులకు కూడా విజయ్ అంటే బోలెడంత ప్రేమ. అందుకే ఇన్‌స్టాగ్రామ్‌లో కోటి మంది ఫాలోవర్లను దక్కించుకోగలిగాడు విజయ్. ప్రస్తుతం 10 మిలియన్ల ఫాలోవర్స్ కలిగి రికార్డు సృష్టించాడు. దక్షిణాది స్టార్స్‌లో ఇన్‌స్టాలో కోటిమంది ఫాలోవర్లను సంపాదించుకున్న మొదటి హీరో విజయ్ ఒక్కడే కావడం విశేషం. ఈ క్రమంలో ‘వన్ క్రోర్ ఇన్‌స్టా రౌడీస్’ అనే ట్యాగ్‌తో సోషల్ మీడియా అంతా విజయ్ ఇన్‌స్టా రికార్డ్ హల్‌చల్ చేసింది.
ఈ రికార్డు సాధించిన నేపథ్యంలో విజయ్ ఓ పోస్ట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన ఫాలోవర్స్‌తో షేర్ చేసుకున్నాడు. పదిమందికి అయినా.. అంతే లవ్ అని 100 మందికి అయినా తాను చూపించే లవ్ అంతేనని.. తాజాగా కోటి మందికి అయినా ఆ ప్రేమ తగ్గదని కొంత భావోద్వేగంతో రాశాడు. దీంతో తన ఫాలోవర్స్ కూడా భావోద్వేగం అవుతూ.. లవ్ యూ విజయ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అందుకే నువ్వంటే ఇష్టమని అంటున్నారు.