ఉపాధి హామీ.. కూలీ పెంపు

హైదరాబాద్: ఉపాధి హామీ కూలీలకు రాష్ట్ర సర్కార్ శుభవార్త చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ రోజువారీ కూలీని పెంచింది. రోజు వారీ కూలీ రూ. 237 నుంచి రూ. 245కి పెంచుతూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన కూలీ.. ఈ నెల 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది.