ఎంపిలో ఐదుగురి అనుమానాస్పద మృతి

ఖార్గాపూర్ (ఎంపి): మధ్యప్రదేశ్ లో ఒకే కుటుంబాన‌కి చెందిన వారు ఐదుగురు అనుమానాస్ప‌ద స్థితిలో మ‌ర‌ణించారు. ఎంపిలోని టికామ్‌గ‌ఢ్ జిల్లాలోని ఖ‌ర్గాపూర్ ప‌రిధిలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. స్థానికంగా మనోహర్ సోని, అతడి భార్యతోపాటు ఐదుగురు కుటుంబసభ్యులు వారి ఇంట్లో వేలాడుతూ కనిపించడం ఆ ప్రాంతంలో సంచలనమైంది. విష‌యం తెలుసుకున్న ఎస్పీ ప్రశాంత్ ఖరే ఘ‌ట‌నా స్థలానికి వ‌చ్చి పరిశీలించారు. మృతిచెందిన ఐదుగురి పాదాలు నేలను తాకుతూ వేలాడుతుండ‌డాన్ని ప‌రిశీలించి పోలీసులు ఇది హ‌త్యాగానే అనుమానిస్తున్నారు. మృతుల వివ‌రాలు.. ధర్మదాస్ సోని (62), అతడి భార్య పూనా సోని (55), కుమారుడు మనోహర్ సోని (27), మనవలు సోనమ్ సోని (25), సానిధ్య సోని (4).

Leave A Reply

Your email address will not be published.