ఎంపి ఆరోగ్య మంత్రికి కరోనా

భోపాల్‌ : క‌రోనా మ‌హ‌మ్మారి రాజ‌కీయ నాయ‌కుల‌ను, మంత్రుల‌ను కూడా వ‌ద‌ల‌డం లేదు. ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా అనేక మంది కేంద్ర మంత్రులు, ప‌లు రాష్ట్రాల‌కు చెందిన మంత్రులు ఈ వైర‌స్ భారిన ప‌డ్డారు. తాజాగా ఆదివారం మధ్యప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి ప్రభురామ్‌ చౌదరి కరోనా మహమ్మారి బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌ ద్వారా ధ్రువీకరించారు. తనకు సన్నిహితంగా మెదిలిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని, సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉండాలని కోరారు. ‘ఆశీర్వాదాలతో ప్రజలకు సేవ చేసేందుకు త్వరలోనే తిరిగి వస్తాను’ అని ట్వీట్‌ చేశారు. మధ్యప్రదేశ్‌లో జూలై చివరి వారంలో ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ అనంతరం ఏడుగురు మంత్రులు వైరస్‌ పాజిటివ్‌గా పరీక్షించారు. పబ్లిక్ వర్క్ శాఖ మంత్రి గోపాల్ భార్గవ, వైద్య విద్యాశాఖ మంత్రి విశ్వాస్ సారంగ్, రాష్ట్ర సహకార శాఖ మంత్రి అరవింద్ భడోరియా, జలవనరుల శాఖ మంత్రి తులసీరాం సిలావత్, ఉన్నత విద్యా మంత్రి మోహన్ యాదవ్, వెనుకబడిన తరగతి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి రామ్ ఖేలవాన్ పటేల్ సైతం వైరస్‌ పాజిటివ్‌గా పరీక్షించారు.

Leave A Reply

Your email address will not be published.