ఎపిలో కొత్తగా 136 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో కొత్తగా 136 మందికి కరోనా పాజిటివ్‌గా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. కాగా వైరస్‌తో తాజాగా ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు.తాజా మరణంతో కలిపి కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 7,174కు చేరింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,90,692కి చేరింది. ఇప్పటి వరకు వరకు 8,82,520 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 998 యాక్టివ్ కేసులున్నాయని అధికారులు పేర్కొన్నారు.