ఎపిలో కొత్తగా 210 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 44,709 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 210 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే కరోనా కారణంగా ఒక్కరు మృతి చెందారు. అదే సమయంలో 140 మంది రికవరీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,91,388కి చేరింది. అలాగే కోలుకున్నవారి సంఖ్య 8,82,981 కి చేరింది. తాజా మరణంతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో 7,180 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,227 యాక్టివ్ కేసులు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.