ఎలాంటి సవాలైనా ఎదుర్కొంటాం: రాజ్‌నాథ్

న్యూఢిల్లీ : భారత్- చైనా దేశాలమధ్య మంచుకొండల్లో కూడా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థతి నెలకొంది. చైనాతో సరిహద్దు వివాదంపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంట్‌లో గురువారం మరోసారి ఆసక్తికర ప్రకటన చేశారు. సరిహద్దు వివాదంపై ఎంపీలు లేవనెత్తిన ప్రశ్నలకు రాజ్‌నాథ్ సమాధానమిచ్చారు. చైనాతో ఎలాంటి సవాళ్లనైనా తాము ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నట్లు మరోసారి స్పష్టం చేశారు. మన సాయుధ బలగాలతో చైనాకు ఇప్పటికే గట్టిగా సమాధానమిచ్చామని.. ఇరుదేశాల మధ్య ఉన్న ఒప్పందాలను చైనా బహిరంగంగానే ఉల్లఘింస్తుందని మరోసారి గుర్తుచేశారు. కాగా గత మంగళవారం చైనా సరిహద్దు వివాదంపై రాజ్‌నాథ్ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. సరిహద్దుల్లో పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నాయని సమస్య ఇంకా పరిష్కారం కాలేదని స్పష్టం చేశారు.