ఏపీలో కొత్తగా 158 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 158 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు శనివారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. కొత్త వాటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,86,852 కి చేరింది. ఇందులో 8,78,232 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,473 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో ఒక్కరు మాత్రం మరణించారు.