ఏలూరుకు కేంద్ర ప్ర‌భుత్వ బృందం..!

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ప్రజలు ఒక్కసారిగా మూర్చ లక్షణాలతో హటాత్తుగా అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. ఈ ఘటన ఇప్పుడు కేవలం ఏలూరులోనే కాదు యావత్ ఆంధ్ర ప్రదేశ్ లోనూ ఆందోళనకు కారణమయ్యింది. ఈ ఘటనకు కారణాలు తెలియరావడం లేదు. ఏలూరులో మాత్రం అస్వస్థతకు గురైన బాధిత కేసులు నమోదవుతూనే ఉన్నాయి. బాధితుల రక్త నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. ఎలాంటి వైరస్‌ లేదని నిర్ధారించారు. ఈ క్రమములో బాధితుల సంఖ్య 350 దాటింది. అంతుచిక్కని అనారోగ్యంతో ఇప్పటికి ఏలూరు ఆస్పత్రిలో చికిత్స పోతున్నారు. ఈ నేపథ్యంలో ఏలూరుకు కేంద్ర ప్రభుత్వ బృందం రానుంది. అంతుచిక్కని వ్యాధి మీద కేంద్ర బృందం ఆరా తీయనుంది. NHDC నుండి ముగ్గురు ప్రతినిధులు ఏలూరు రానున్నారు. ఇప్పటికే సీఎం జగన్‌ ఏలూరు ఆస్పత్రిలో బాధితులను పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు.

Leave A Reply

Your email address will not be published.