ఐజీని కబళించిన కరోనా

లక్నో: కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తోంది. భారత్లో కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 1,14,031 మందిని పొట్టనబెట్టుకుంది. ఇప్పటికే పలువురు ప్రముఖులను ఈ మహమ్మారి పొట్టనపెట్టుకుంది. ఇలాంటి కష్టసమయాల్లో డాక్టర్లు, పోలీసులు పారిశుద్ధ్య కార్మికుల సేవలను మరువలేము. ప్రాణాలకు తెగించి మరీ సేవ చేస్తున్నారు. కరోనాపై జరిగే పోరాటంలో ఎందరో ఫ్రాణాలు కూడా అర్పించారు. తాజాగా బీహార్ రాష్ర్టానికి చెందిన పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ కరోనాతో కన్నుమూశారు. పుర్నియాలో ఐజీగా విధులు నిర్వర్తిస్తున్న ఐపీఎస్ బినోద్ కుమార్ మూడు రోజులుగా కరోనాతో పోరాడి ఆదివారం ఉదయం ప్రాణాలు విడిచారు.
ఇప్పటికే ఆ రాష్ట్రం నుండి రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కపిల్ డియో కామత్, బీజేపీ నేత, బిహార్ మంత్రి వినోద్ కుమార్ సింగ్ కూడా కోవిడ్ కాటుకు ఇటీవల మరణించారు. ఇక రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,91,619 చేరగా.. వైరస్ బారినపడి 990 మంది మరణించారు.