కరోనా కట్టడికి యోగాసనాలు!

కరోనా వైరస్ నుండి రక్షణ కొరకు, వ్యాధినిరోధక శక్తి కొరకు యోగాసనములు, సూర్యనమస్కారలు
సూర్యనమస్కారలు..
ప్రతి మనిషికి రెండు కండ్లు ఎలాంటివో, భూమండలమంతటికి సూర్యుడు, చంద్రుడు అలాంటివారు. ముందుగా సూర్యుడు ప్రపంచమంతటికి వెలుగునిస్తాడు. అంతే కాకుండా రవికిరణం తాకనిదే నవ కమలం విరిసేన అన్నారు. మొగ్గ మీద తెల్లవారుజామున రవికిరణం పడగానే మొగ్గ విచ్చుకొని పువ్వులగా మారుతుంది. మొగ్గ విప్పుకున్నపుడు చూస్తే ఇదొక పెద్ద అద్భుతం, ఊహకు అందని ఆనందం వస్తుంది. సృష్టిలో చాలా అద్భుతాలు ఉన్నాయి. కానీ చూడటానికి మన వయసు సరిపోదు.
సూర్యుడు బ్రహ్మమండాని కంతటికి శక్తిని సమకూరుస్తాడు. సూర్యరశ్మిలో ఏడు అగ్నులు, (సప్తాగ్నులు), ఐదు విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. మన శరీరంలో కూడా ఏడు ప్రాణ ప్రవాహ కేంద్రాలున్నాయి. సూర్య నమస్కారములు వలన ఇవన్నీ ప్రభావితమౌతాయి. 12 స్థితులుంటాయి. భిన్న భిన్న క్రియల ద్వారా శరీరంలో అన్ని భాగాలకు ప్రాణ సంచారం జరుగుతుంది. దీనిని ఎక్కువ కాలం చేయటం వలన అంతగర్గత శక్తులు వికసిస్తాయి.
ప్రతిరోజు సూర్యనమస్కారలు చేసేవారు ఆరోగ్యవంతమైన శరీరానికి పాదరసం లాంటి బుర్రకు అధిపతి అవుతారు.జీవితంలో ఎదురయ్యే అనేక సవాళ్ళను సునాయాసంగా ఎదురుకోగల శక్తిని మన స్వంతం చేసుకోగలుగుతాం
యోగ చేసే వ్యక్తులు వారి యొక్క శరీరం తేలికగా ఉంటుంది. చలాకీగా,చురుగ్గా, వుంటారు.శరీరం మాములుగా చక్కని టోనింగ్ తో ఉంటుంది.శరీరం ఫ్లెక్సీబిలిటీగా ఉంటుంది.యోగాసనాలు చేయటం వలన వారు మానసిక ప్రాంతత కలిగి ఉంటారు.అందరికి ఒక చైతన్యవంతంగా కనపడతారు.ఉదయాన్ని లేచి యోగ చేయమంటే వామ్మో లేవలేమని బద్ధకంగా పడుకుంటాం.కానీ ఒక్కసారి యోగ చేయటము రుచి తగిలితే వంకాయ కూర రుచి కంటే బాగుంటుంది సుమా. యోగ చేస్తే మలబద్దకం మటుమాయం అవుతుంది.సమస్త అవయవాలు చైతన్యవంతం అవుతాయి.
సూర్యనమస్కారములు… 10 మరియు 12 రకములున్నాయి. 12 రకాల సూర్య నమస్కారములు చేయటం వలన కండరాలు, జాయింట్లు, లింగ్మెంట్స్, ఎముక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. స్టిఫ్నెస్ ని తగ్గిస్తాయి.
యోగ గురువుల సమక్షంలో చేస్తే చక్కని ఫలితాలు ఇస్తాయి. మానసికంగా, శారీరకంగా దృఢంగా మారి ఒత్తిడి నుండి విముక్తులు అవుతారు.
1 ప్రణామాసన.. చేయు విధానం.
మొదటిది.చివరగా చేతవలసిన ఆసనం ఇదే.రెండు చేతులు జోడించి హృదయ చక్రము లేదా ఛాతి వద్ద ఉంచాలి. ఈ భంగిమ మానసిక ఒత్తిడిని, తగ్గిస్తుంది.ఏకాగ్రతను పెంచుతుంది
రెండు చేతులు జోడించడం అంటే మెదడులో కుడి, ఎడమ, హేమి సపీయర్ లను కలపడానికి చిహ్నం. ఈ భంగిమలో కాళ్ళు రెండు దగ్గరగా పెట్టి నిటారుగా నిల్చొని ఉఛ్వాస, నిశ్వాస పై ఏకాగ్రత నిలిపితే స్ట్రెస్,దూరం అవుతుంది.
2. హస్తౌతానాసనం..
రెండు చేతులు పైకెత్తి తలపైన జోడించి పై శరీర భాగాల్ని, పక్కటెముకలను పైకి లాగుతూ శ్వాస తీసుకోవాలి. ఈ ఆసనం మెడ వీపు కండరాల్ని చైతన్యవంతం చేస్థాయి.
వెన్నుముక బలం ఆవుతుంది.,స్థూలకాయం రానివ్వదు,వచ్చిన స్థూలకాయం తగ్గుతుంది.శరీరంలో పై భాగాలన్ని మంచి శక్తిని పుంజుకుంటాయి.
3. పాదహస్తాసన..
ఈ భంగిమ తో చాలా ఉపయోగం వుంటుంది. ఇది చాలా శక్తివంతమైనది.నిద్రలేమి,లావుతగ్గటం, ఆస్టియో పోరోసిస్ లను తగ్గిస్తుంది. మానసిక ఒత్తిడి తగ్గిస్తుంది. పిరుదులు, ముంజేతులకు స్ట్రెచ్ అవుతాయి. హెచ్చరిక. నడుము నొప్పి ఉన్నవారు చేయరాదు. లేదా మోకాళ్ళు వంచి చేయాలి.
4.అశ్వాసంచాలనాసనం..
సూర్యనమస్కారములో 4వది మరియు 9 వ నమస్కారం కూడా ఇలానే ఉంటాయి. శ్వాసను పీల్చుతూ ఎడమ కాలిను వెనక్కి తీసుకు వెళ్ళాలి. పంజా నిలబడే ఉండాలి. నడుము కిందకు ఉండాలి. ఛాతి ముందుకు రావాలి. మెడ ను వెనక్కి వంచి ధ్యానాన్ని స్వాధిష్ఠాన చక్రం పై నిలపాలి.
5. పర్వతాసన…
ఊపిరి బయటకు వదులుతూ చేయాలి.కుడి కాలును వెనకకు తీసుకొని వెళ్ళాలి. ముందు భంగిమ నుంచి శరీరాన్ని పైకి లాగి, v ఆకృతిలో వంచాలి. కాళ్ళను తిన్నగా
వుంచి నెలకు కాళ్ళను అనించాలి. ముందు చేతులు అనించాలి. ఈ భంగిమలో భుజాలు రీలాక్స్ అవుతాయి. చెవులు, ముంజేతులు, లోపలివైపుకు ఉంటాయి. స్థిరంగా శ్వాసక్రియలు అనుసరించాలి. దీని వలన శరీరమంతా శక్తి ప్రసరిస్తుంది. జీర్ణక్రియ, బాగా పనిచేస్తుంది. సైనస్ తగ్గుతుంది..
6. అష్టాంగ/సాష్టాంగ నమస్కారం ఆసనం.
ఈ ఆసనంలో శరీరంలో ఎనిమిది కేంద్రాలు భూమితో అనుసంధానం అవుతాయి.పాదాలు, మోకాళ్ళు, ఛాతీ, అరచేతులు, చుబుకం, నుదురు, భూమిని తాకుతాయి.
భూమికి దాని శక్తులపట్ల గౌరవం ఉన్నట్లుగా తెలిపే పోశ్చర్. ఆటోమాటిక్గ్స్ శరీరం మొత్తం శక్తిని సంతరించుకుని పునరుత్తేజం అవుతుంది.
ఒకసారి ఎక్కడైతే ఈ స్థితిలో చేతులు పాదాలను మోపుతారో అక్కడి నుండి మరి ముందుకు వెనుకకు కదపవద్దు.
7. భుజంగాసనం..
దీనిని కోబ్రా భంగిమ అంటారు.ఈ అసనంలో నడుమునుంచి పై భాగాన్ని ముంచేతులు సపోర్ట్ తో లేవాలి. అరచేతులు నేలకు ఆనించి ఉంచాలి. మెడను తిన్నగా పైవైపు చూస్తున్నట్లు ఉంచాలి.
పాము మాదిరిగా పైకి లేపి ఉంచుతాం కనుక దీనిని భుజంగాసనం అంటారు.
భుజాలను దృఢపరచటంలో సహకరిస్తుంది. చేతిని, వెన్నుముకను బలోపేతం చేస్తుంది.
పిరుదుల ప్రాంతం బిగుతగా ఇచ్చి ఒత్తిడిని విడుదల చేస్తుంది.
శరీరంలో రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచటంలో ఈ ఆసనం దోహదపడుతుంది.
8. పర్వతాసన..
భుజంగాసానికి కొనసాగింపు. అదే అసనం నుంచి కాలి వేళ్ళ కొనలపై పైకి లేవాలి.సరిగ్గా జాగ్రత్తగా చేయాలి.
ఈ భంగిమలో మధ్య వేలు ముందుకు చూస్తూ వుండాలి. వెన్ను నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. జీర్ణశక్తి మెరుగుపరుస్తుంది.
ముంజేతులు, భుజాలు,మణికట్టులు దృఢపడుతాయి. తలనొప్పి, నిద్రలేమితో పోరాడేందుకు పర్వతాసనం చాలా బాగా పనిచేస్తుంది.
9. అశ్వాసంచాలనసనం..
ముక్కులతో గాలి పీల్చుకుంటూ కుడి కాలు, రెండు అరచేతులు నడుము వంచాలి. నెమ్మదిగా వెనక్కి వంగుతూ పైకి చూడాలి. శ్వాస క్రియ నడుస్తూ ఉండాలి.
ఈ ఆసనం ఉదర భాగాలను మసాజ్ చేస్తుంది. ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది.
10. పాదహస్తాసన..
నెమ్మదిగా గాలి బయటకు వదులుతూ రెండు పాదాలు దగ్గరగా ఉంచి చేతులతో నేలకి తాకాలి.
ఇది పూర్తిగా చేతుల నుంచి పాదాల దాకా చేసే ఆసనం.
శారీరక ఫ్లెక్సీబిలిటీకి సవాలుగా చేయకూడదు.
ఎంత వరకు వంగితే అంత వరకే వంగాలి. అప్రయత్నంగా చేయరాదు.ఇది ప్రాక్టీస్ తో ముందుకు పూర్తిగా వంగగలము. నడుము నొప్పివుంటే జాగ్రత్తగా చేయండి
11. హాస్తౌతానాసన…
ఈ అసనంలో చేతులను, గాలి పీల్చుతూ పైకెత్తి ఎటువంటి వణుకు బెణుకు లేకుండా వెనక్కు వంగాలి.
12. ప్రణామాసన..
గాలి వదులుతూ ఒకటొవ భంగిమకు రిపీట్ చేయాలి. ఇలా 12 గతులు చేయాలి.
హెచ్చరిక: నడుము నొప్పి ఉంటే, ముందుకు వంగకూడదు. హెర్నియా ఉంటే వెనకకు వంగకూడదు. గురువుల సమక్షంలో నేర్చుకోండి. ప్రారంభంలో 3 సార్లు చేయాలి. తరువాత పెంచుకుంటుపోవాలి.
సూర్యనమస్కారములు ప్రతిరోజు చేయటం వలన నోప్పులు తగ్గుతాలు. పదే పదే రావు.
-షేక్.బహర్ అలీ.
యోగాచార్యుడు.