కాకినాడలో వివాహిత అనుమానాస్పద మృతి

కాకినాడ: ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పల్లంరాజునగర్‌లో రమ్యశ్రీ అనే వివాహిత ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే భర్త, అత్తమామలు కలిసి రమ్యశ్రీని హత్య చేసారని బంధువులు ఆరోపిస్తున్నారు. బాత్రూం శుభ్రం చేసే కర్రతో కొట్టి చంపి ఫ్యాన్‌కు ఉరి వేసి భర్త ఈ దారుణానికి ఒడిగట్టాడని మృతురాలి బంధువుల ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.