కాలువలోకి దూసుకువెళ్లిన కారు.. ముగ్గురు మృతి

రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం లొల్ల లాకుల వద్ద కారుకాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. మృతులు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వాసులుగా గుర్తించారు. ఆత్రేయపురం మండలం వసంతవాడ తీర్థానికి వెళ్లి వస్తుండగా ప్రమాదవశాత్తు కారు లొల్ల లాకుల వద్ద కాలువలోకి దూసుకు వెళ్లింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఒకరి మృతదేహం లభ్యమవగా.. మరో ఇద్దరి మృతదేహాల కోసం గాలిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను సహాయక చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.