కుత్బుల్లాపూర్‌లో వద్ద ఉద్రిక్తత

కుత్బుల్లాపూర్: హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్ డివిజన్‌లో ఉద్రికత్త పరిస్థితులు తలెత్తాయి. కాంగ్రెస్ నాయకులు, పోలీసుల మద్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో పోలీసులు లాఠీ చార్జీ చేశారు. ఈ సందర్భంగా పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. కుత్బుల్లాపూర్ 125 డివిజన్ గాజులరామారంలో కాంగ్రెస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం సోదరుడు కూన శ్రీనివాస్‌గౌడ్ నామినేషన్ దాఖలు చేశారు. నామపత్రాల పరిశీలన సమయంలో ఆయన నామినేషన్‌ను అధికారులు తొలగించారు. దీంతో మల్కాజ్‌గిరి ఎంపి రేవంత్‌రెడ్డి, శ్రీశైలం గౌడ్, ఇతర కాంగ్రెస్ కార్యకర్తలు జిహెచ్ ఎంసి కార్యాలయం ఎదుట భైఠాయించారు. కార్యకర్తలు జిహెచ్ ఎంసి కార్యాలయంలోకి దూసుకొచ్చే ప్రయత్నం చేయగా పోలీసులు లాఠీ చార్జీ చేశారు. ఈ క్రమంలో ఎస్ ఐ మన్మదకు గాయాలయ్యాయి. మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్‌ను అరెస్టు చేసి పోటీసు స్టేషన్‌కు తరలించారు. రిటర్నింగ్ అధికారి అన్యాయంగా శ్రీనివాస్‌గౌడ్ నామినేషన్‌ను తిరస్కరించారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.