కేక పుట్టిస్తున్న మహేష్ లుక్… నమ్రత కామెంట్!

కొంత మందికి వయసు పెరుగుతున్నప్పటికీ వారిలో ఎలాంటి మార్పూ ఉండదు. అలాంటి వారిలో సూపర్ స్టార్ మహేష్ ఒకరు. 45 ఏళ్ల వయసులో కూడా మహేష్ యువకుడిలా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు.
కరోనా వలన దాదాపు ఏడు నెలలు ఇంటికి పరిమితమైన మహేష్ బాబు రీసెంట్‌గా తన ఫ్యామిలీతో వెకేషన్‌కు వెళ్లారు. అక్కడ ఫ్యామిలీతో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ, అక్కడి అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు అందిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.
తాజాగా మహేష్ ఫొటోను నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దుబాయ్ విమానాశ్రయంలో తెల్లవారుజామున 3 గంటలకు తీసిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. `తెల్లవారు జామున 3 గంటల సమయంలో ఎవరు ఇలా కనిపిస్తారు` అంటూ కామెంట్ చేశారు. ఈ ఫొటోలో మహేష్ అత్యంత స్టైలిష్‌గా ఉన్నారు. పోస్ట్ చేసిన కొద్ది సమయంలోనే ఈ ఫొటో వైరల్‌గా మారింది.
View this post on Instagram