కొత్త పార్లమెంట్ భవనం శంకుస్థాపనకు సుప్రీం గ్రీన్‌సిగ్నల్

న్యూఢిల్లీ: కొత్త పార్లమెంట్ భవన శంకుస్థాపనకు సుప్రీంకోర్టు సోమవారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 10న ఈ కార్యక్రమం యథావిధిగా జరగనుంది. సెంట్రల్ విస్టా ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న భవనాలను కూల్చడం గానీ, కొత్తగా నిర్మించడంగానీ, ఇక్కడి చెట్లను తరలించడంగానీ చేయబోమన్న కేంద్ర ప్రభుత్వ హామీ మేరకు కోర్టు ఈ తీర్పు వెలువరించింది. ఈ ప్రాంతంలోని ప్రాజెక్ట్‌పై కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలోనూ కేంద్రం కొత్త నిర్మాణాలు, కూల్చివేతలు, చెట్ల తరలింపులు చేస్తుండటంపై జస్టిస్ ఏఎం ఖన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. అక్కడ కచ్చితంగా ఎలాంటి కొత్త నిర్మాణాలు చేపట్టడంగానీ లేదా కూల్చివేతలుగానీ జరగకూడదని స్పష్టం చేసింది.