క‌రోనా నియంత్రణలో కేసీఆర్‌ సర్కార్‌ విఫలం: గవర్నర్‌ తమిళిసై

హైదరాబాద్‌: క‌రోనా నియంత్రణలో కేసీఆర్‌ ప్రభుత్వం విఫలమైందంటూ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా పెరుగుద‌ల‌ను ప్రభుత్వం అంచనా వేయలేకపోయిందని చెప్పారు. కరోనా నియంత్రణకు పెద్ద సంఖ్యలో టెస్టులు చేయడమే పరిష్కారమార్గమనీ, మొబైల్‌ టెస్టింగ్‌లు చేయాలని ప్రభుత్వాన్ని కోరామని చెప్పారు. కరోనా తీవ్రత, వ్యాప్తిపై ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ సూచనలు చేస్తూ… ఐదారు లేఖలు రాసినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనలేదని గవర్నర్‌ తమిళిసై ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

గవర్నర్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఆగ్రహం
గవర్నర్ తమిళ సై చేసిన ట్వీట్‌పై టీఆర్‌ఎస్‌ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ తమిళ సై వ్యాఖ్యలపై టీఆర్ఎస్ హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి తీవ్రంగా స్పందించారు. బీజేపీ అధ్యక్షురాలిలా గవర్నర్ మాట్లాడుతున్నారంటూ సైదిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Leave A Reply

Your email address will not be published.