గొప్పమనసు చాటుకున్న మంత్రి కెటిఆర్

హైదరాబాద్: తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన అక్కాచెల్లెళ్ల పరిస్థితిపై మంత్రి కెటిఆర్ స్పందించి తన గొప్ప మనసు చాటుకున్నారు. ఆ అనాథలైన అక్కాచెల్లెళ్ల బాధ్యతలను జిల్లా కలెక్టర్‌కు అప్పగించారు. వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ జిల్లాలోని నిడమనూరు మండల కేంద్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉప్పోంగిన వాగు దాటుతూ పెందోటి లక్షమ్మ అనే మహిళ వరద ఉధృతికి చనిపోయింది. దాంతో భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త నర్సింహా ఉరేసుకుని చనిపోయాడు. వారం రోజుల వ్యవధిలో తల్లిదండ్రులను కోల్పోయిన అక్కాచెల్లెళ్ల పరిస్థితి వివరిస్తూ అదే గ్రామానికి చెందిన పేలపోలు ప్రణయ్ అనే వ్యక్తి మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఆదుకోవాల్సిందిగా కోరారు. స్పందించిన మంత్రి కెటిఆర్ పిల్లల సంరక్షణ బాధ్యతలు చూడాల్సిందిగా జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌ను మంత్రి కోరారు.
తప్పకచదవండి:దేశానికే `ధరణి` ఆదర్శకంగా నిలుస్తుంది: మంత్రి కెటిఆర్
Request @Collector_NLG to take care of these children https://t.co/3DV8RuoeHb
— KTR (@KTRTRS) October 29, 2020