గౌరవం ఆత్మమీదా? ఆస్తుల మీదా?
ఆనాడే ఎందుకు రాజీనామా చేయలేదు: ఎమ్మెల్సీ పల్లా

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఎంతో మందిని కెసిఆర్ నాయకులుగా తయారు చేశారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ఎల్పీలో పల్లా రాజేశ్వర్ రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ మీద.. ముఖ్యమంత్రిపై నోరు పారేసుకున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆత్మగౌరవం కోసం కాదు.. ఆస్తుల రక్షణ కోసమే ఈటల ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనకు ఆత్మగౌరవం ఉంటే.. పేదల ఆస్తులను అక్రమంగా ఆక్రమించేవారు కాదు అని పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.
ఎంతో మంది పార్టీని వీడుతూ ఆరోపణలు చేశారని.. ఈటల కూడా అదే చేశారన్నారు. పార్టీ నుంచి బయటకు వెళ్లిన వారి పరిస్థితి ఎంటో అందరికీ తెలుసని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఎంతో మందిని కేసీఆర్ నాయకులుగా తయారు చేశారు. కేసీఆర్ వల్లే తెలంగాణ సాధ్యమైందన్నారు. ఈటలకు పార్టీలో కెసిఆర్ సముచిత గౌరవం ఇచ్చారన్నారు. 2009లో టిఆర్ ఎస్ శాసనసభాపక్ష నేతగా.. అంతకు ముందు జిల్లా స్థాయిలో కీలక పదవులు కట్టబెట్టారని గుర్తు చేశారు. కెసిఆర్ తర్వాత పార్టీఅఓ అన్ని ముఖ్య పదవులను ఈటల పొందార్నారు.
అనామకుడు ఇచ్చిన ఫిర్యాదుపై సీఎం కేసీఆర్ స్పందించారంటే అది నియంతృత్వం కాదు ప్రజాస్వామ్యం అని తెలిపారు. పార్టీలో ఉన్నప్పుడు దేవుడు అన్నాడు.. బయటకు వెళ్లి నియంత, దెయ్యం అంటున్నారు. అనవసరంగా నోరు పారేసుకుంటే.. సూర్యుడిపై ఉమ్మేసినట్టే. ఈటల వెనుక ఉన్నది కొంత మంది అసంతృప్తులు మాత్రమే అని తెలిపారు.
హుజురాబాద్ ప్రజలందరూ టీఆర్ఎస్ వైపే ఉన్నారని స్పష్టం చేశారు. రైతు బంధు పథకం మీద ఈటల వ్యాఖ్యలు అర్థరహితం అన్నారు. ప్రగతి భవన్‌లోకి రానివ్వలేదని చెబుతున్నారు. ప్రగతి భవన్‌లోకి రానివ్వకుంటే అప్పుడు ఎందుకు రాజీనామా చేయలేదు? అని ప్రశ్నించారు. ఆరు నెలలుగా రైతులు చేస్తున్న పోరాటన్ని తొక్కి పెట్టి వాళ్లను హింసిస్తున్న బిజెపిలో ఎలా చేరుతున్నారని ఈటలను పల్లా ప్రశ్నించారు. బడుగు, బలహీన వర్గాలపై నిజంగా ప్రేమ ఉంటే వారి భూములు ఎందుకు ఆక్రమించారు అని పల్లా రాజేశ్వర్ రెడ్డి అడిగారు.