చెంప చెళ్లుమనిపించిన కలెక్టర్ పై వేటు

రాయ్పూర్(CLiC2NEWS) :  కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించాడన్న ఆరోపణలపై ఓ వ్యక్తి చెంపను చెళ్లుమనిపించిన సూరజ్‌పూర్‌ జిల్లా కలెక్టర్‌ రణదీప్‌ శర్మను ఆదివారం విధుల నుండి చత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేష్‌ భగేల్‌ తొలగించారు. తక్షణమే రణదీప్‌ను విధుల్లో నుండి తొలగిస్తున్నట్లు తెలిపారు.

వివరాల్లోకి వెళితే…కరోనా కేసులు పెరుగుతుండటంతో చత్తీస్‌గఢ్‌లో లాక్‌డౌన్‌ విధించారు. సూరజ్ పూర్ జిల్లా కలెక్టర్ రణబీర్ శర్మ లాక్ డౌన్ అమలు తీరును పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో అత్యవసరంగా మందులు కొనడానికి వెళ్తున్న ఓ వ్యక్తిని కలెక్టర్ రణ్ బీర్ శర్మ, పోలీసులు అడ్డుకుని దురుసుగా ప్రవర్తించారు.
ఆసమయంలో కలెక్టర్‌ శర్మ, అమన్‌కు మధ్య వాదన జరిగింది. ఇంతలో అమన్‌ ఫోన్‌లో ఏదో చూపిస్తుండటంతో…పట్టించుకోకుండా ఫోన్‌ను నేలకేసి కొట్టడమే కాకుండా…అతడి చెంప చెల్లుమనిపించాడు. అంతలో అక్కడే ఉన్న పోలీసులకు కూడా అమన్‌ను కొట్టాలని ఆదేశించాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్‌ చల్‌ చేస్తుంది. దీంతో ఐఎఎస్‌ శర్మపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కలెక్టర్‌ రణ్‌ బీర్‌ కూడా ఈ ఘటనపై స్పందించారు. తాను కావాలని చేయలేదని..అంటూ క్షమాపణలు చెప్పారు

మరోవైపు, రణబీర్ ప్రవర్తనను ఐఏఎస్ అసోసియేషన్ కూడా తీవ్రంగా తప్పుబట్టింది. ఆయన ప్రవర్తన ఎంతమాత్రమూ సమర్థనీయం కాదంటూ ట్వీట్ చేసింది. సేవ, నాగరితక ప్రాథమిక సిద్ధాంతాలకు ఇది పూర్తిగా విరుద్ధమని పేర్కొంది. కాగా, కలెక్టర్ రణబీర్ శర్మ ఆ తర్వాత తన ప్రవర్తనకు క్షమాపణలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.