జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల కోన హర్షం..

అన్నా క్యాంటీన్ లు పునః ప్రారంభించాలి..

మండపేట (CLiC2NEWS): కరోనా మహమ్మారి కారణంగా తల్లి దండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారుల భవిష్యత్ కోసం రూ. పది లక్షల నగదును ఇస్తానని ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం హర్షణీయం అని మండపేట అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ కోన సత్యనారాయణ అన్నారు. కరోనా కారణంగా కుటుంబాన్ని కోల్పోయి అనాథలుగా మిగిలి ఉన్న చిన్నారుల ఆలనా పాలన, వారి బాగోగుల బాధ్యతను ప్రభుత్వం తన భుజం పై వేసుకోవాలన్న సంకల్పం చాలా సంతోషంగా ఉందని అన్నారు.

ఈ సందర్భంగా బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ నిర్ణయానికి అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్ మరోకార్యక్రమం కూడా చేపడితే పేదల ఆకలి తీర్చిన గొప్ప వ్యక్తిగా నిలిచి పోతారని అన్నారు. ఈ సమయంలో పనులు లేక ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని అన్నారు. పనుల్లేక అర్ధాకలితో అలమటిస్తున్న రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం కరోనా వేళ అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ప్రభుత్వం అన్నా క్యాంటీన్ లపై పునరాలోచన చేయాలని అన్నారు. తమిళనాడు రాష్ట్రం మాదిరిగా మన రాష్ట్రంలో కూడా అన్నా క్యాంటీన్ లు నడిపించాలని కోరారు. ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న అన్న క్యాంటీన్ లు పునః ప్రారంభించి పేదలకు అన్నం పెట్టాలని కోరారు. ఆంధ్రా అన్నపూర్ణమ్మ గా ఖ్యాతి చెందిన డొక్కా సీతమ్మ పేరు ఈ క్యాంటీన్ లకు పెట్టి పునరుద్ధరించాలని కోన విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.