జనవరిలో వ్యాక్సినేషన్ ..!: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్

న్యూఢిల్లీ : జనవరిలో దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభించే అవకాశాలున్నాయని కేంద ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. టీకా సామర్థ్యం, భద్రతకే ప్రభుత్వం తొలి ప్రాధాన్యతనిస్తుందని చెప్పారు. జనవరిలో ఏ వారంలోనైనా వ్యాక్సినేషన్ ప్రారంభిస్తామని, ప్రజలకు తొలి కోవిడ్ వ్యాక్సిన్ మోతాదు ఇచ్చే స్థితిలో ఉండగలగాలని అన్నారు. అత్యవసర వినియోగ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న వ్యాక్సిన్లను డ్రగ్స్ రెగ్యులేటర్ సమీక్షిస్తున్నట్లు తెలిపారు. కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీ, పరిశోధనల విషయానికి వస్తే..భారత్ ఏ దేశానికి తక్కువ కాదని, తమ ప్రాధాన్యత భధ్రత, సామర్థ్యత అని, ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మన దేశ వ్యాక్సిన్ను అభివృద్ధి చేయడంలో మన శాస్త్రవేత్తలు, నిపుణులు ఎంతో కృషి చేశారని, రానున్న 6-7 ఏడు నెలల్లో 30 కోట్ల మందికి టీకా వేస్తామన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.