జిహెచ్ ఎంసి ఎన్నికల్లో జ‌న‌సేన పోటీ

పవ‌న్ కీల‌క నిర్ణ‌యం

హైద‌రాబాద్‌: గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల‌పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. యువ కార్య‌క‌ర్త‌ల విజ్ఞ‌ప్తి మేర‌కు ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు ఆయ‌న స్ప‌ష్టం చేశారు ఈ మేర‌కు ఓ పవ‌న్ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.
గ్రేటర్‌ ఎన్నికల కోసం కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. గ్రేటర్ హైదరాబాద్‌ ఎన్నికల్లో పోటీ చేయాలని పలువురు కార్యకర్తల నుంచి వినతులు వచ్చాయని.. వారి కోరికను మన్నించి పోటీ చేయాలని నిర్ణయించామని పవన్ కల్యాణ్ ప్రకటించారు. పలు డివిజన్లలో జనసేన కమిటీలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పని చేస్తున్నాయని చెప్పారు.

జీహెచ్ఎంసీ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య ఈ ఎన్నికల్లో ప్రధానంగా పోరు సాగనుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో కలిసి బరిలో దిగి చేతులు కాల్చుకున్న కాంగ్రెస్ ఈసారి ఒంటరి పోరుకే సిద్ధపడుతున్నట్టు సమాచారం.

 

Leave A Reply

Your email address will not be published.