జీహెచ్ఎంసీ ఎన్నికలపై స్టే ఇవ్వలేం: హైకోర్టు

హైదరాబాద్: గ‌్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (జీహెచ్ఎంసీ) ఎన్నిక‌లు ఆపాలంటూ హైకోర్టులో ప్ర‌జాప్ర‌యోజ‌న వాజ్యం (పిల్‌) దాఖ‌లైంది. సుప్రీంకోర్టు తీర్పుల‌కు విరుద్థంగా బీసీ రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేస్తున్నారంటూ ఏఐసిసి అధికార ప్ర‌తినిధి దాసోజు శ్ర‌వ‌ణ్ ఈ పిల్ దాఖ‌లు చేశారు. అత్య‌వ‌స‌ర పిటిష‌న్‌గా స్వీక‌రించి విచార‌ణ జ‌ర‌పాల‌ని శ్ర‌వ‌ణ్ త‌ర‌పు న్యాయ‌వాది హైకోర్టును అభ్య‌ర్థించారు. దీంతో న్యాయ‌స్థానం విచార‌ణ చేప‌ట్టింది.

ఎన్నికలపై స్టే ఇవ్వలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. అయితే విచారణ జరిపేందుకు తమకు అభ్యంతరం లేదని పేర్కొంది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం, ఎన్నికల సంఘం, జీహెచ్ఎంసీకి నోటీసులు జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ఆపాలని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి శ్రవణ్‌ పిల్ దాఖలు చేశారు. పిటిషనర్ అభ్యర్థనతో న్యాయస్థానం అత్యవసర విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. రాజకీయంగా వెనుకబడిన బీసీలను, గుర్తించే ప్రక్రియ లేదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఎంబీసీలపై ప్రేమ ఉంటే పదేళ్ల నుంచి ఎందుకు స్పందించలేదనని కోర్టు ప్రశ్నించింది. ఎన్నికల షెడ్యూల్‌ ఇవ్వబోయే సమయంలోఎందుకు గుర్తొచ్చిందని, రాజకీయ దురుద్దేశంతోనే పిల్‌ దాఖలు చేశారని హైకోర్టు వ్యాఖ్యానించింది. 2015, 2016లో దాఖలైన పిటిషన్లను జత చేయాలని రిజిస్ట్రార్‌ను హైకోర్టు ఆదేశించింది.

Leave A Reply

Your email address will not be published.