టిఆర్ఎస్ స‌ర్కార్‌.. రైతు మేలు కోరే ప్ర‌భుత్వం: పుట్ట శైల‌జ‌

మంథ‌ని: టిఆర్ఎస్ ప్రభుత్వం రైతు మేలు కోరే ప్రభుత్వమని, రైతులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా గ్రామాలలో రైతు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామ‌ని మున్సిప‌ల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ అన్నారు. ధాన్యంకొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంత‌రం పుట్ట శైల‌జ మాట్లాడుతూ… రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజలను స‌ర్కార్ కొనుగోలు చేస్తుంద‌ని అన్నారు. రైతులు సమయమనం పాటించాలనీ ఈ సందర్భంగా రైతులకు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో AMC చైర్మన్ కొత్త శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాంభట్ల సంతోషిని, ఎంపీపీ కొండ శంకర్, జెడ్ పి టి సి తగరం సుమలత, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు ఆకుల కిరణ్, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తగరం శంకర్ లాల్, ఐదవ వార్డు కౌన్సిలర్ నక్క నాగేంద్ర శంకర్, మరియు మార్కెట్ కమిటీ & PACS డైరెక్టర్ లు మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు రైతులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.