టీఆర్ఎస్ మేనిఫెస్టో పూర్తి వివరాలివిగో..

హైదరాబాద్‌ : జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ మేనిఫెస్టోను ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తమ పార్టీ కార్యాలయంలో సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన నగర ప్రజలపై వరాల జల్లు కురిపించారు. డిసెంబర్‌ నుంచి వాటర్‌ బిల్లులు చెల్లించాల్సిన అవసరంలేదని ప్రకటించారు. 98శాతం ప్రజలకు 20 వేల లీటర్ల వరకు ఉచితంగా నీటిని సరఫరా చేస్తామన్నారు. సెలూన్లు, లాండ్రీలు, దోబీఘాట్‌లకు డిసెంబర్‌ నుంచి ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు. జీహెచ్‌ఎంసీలో వర్షాలకు దెబ్బతిన్న దోబీఘాట్లను పునరుద్ధరిస్తామని, లాక్‌డౌన్‌ సమయంలో మోటార్‌ వాహనాల పన్ను రద్దు చేస్తామని తెలిపారు.

ఈ సంద‌ర్భంగా సిఎం కెసిఆర్‌ మాట్లాడుతూ… భార‌త‌దేశంలోనే ఒక నిజ‌మైన కాస్మోపాలిట‌న్ న‌గ‌రంగా గొప్ప చారిత్రకనగరంగా హైదరాబాద్‌ ప్రసిద్ధిగాంచిందన్నారు. ఈ న‌గ‌రానికి చ‌రిత్ర‌, సంస్క్యృతిగ‌ల న‌గ‌రం ఎవ‌రు ఇక్కడి నుంచి వ‌చ్చినా అక్కున చేరుకుందన్నారు. దేశంలోని చాలాచోట్ల క‌నిపించ‌వుకానీ మ‌న‌ద‌గ్గర గుజ‌రాతీ గ‌ల్లీ, పార్సిగుట్ట‌, అర‌బ్‌గ‌ల్లీ, బెంగాళీ, కన్నడ, తమిళ స‌మాజం నుంచి ఇక్కడ వ‌చ్చి మ‌న సంస్కృతిలో లీనమైమయ్యాయి అన్నారు. వారివారి ఆచారాలు, పండుగలు గొప్పగా నిర్వహించుకునే.. ఒక అంద‌మైన పూల బొకేలాంటి న‌గ‌రం హైద‌రాబాద్‌ నగరం అన్నారు. అంద‌ర్నీ క‌డుపులోకి పెట్టుకొని నగరం చూసుకుంటుందన్నారు. ఈ నగరాన్ని తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం విశ్వవ్యాప్తంగా తీర్చిదిద్దే ఎజెండాను టీఆర్‌ఎస్‌‌ అమలు చేస్తుందన్నారు.

16 పేజీల మేనిఫెస్టో పూర్తి వివరాలు..

Leave A Reply

Your email address will not be published.