డబుల్ బెడ్రూం ఇండ్లు ఆత్మగౌరవ ప్రతీకలు : ఆర్థిక మంత్రి హరీష్‌రావు

సిద్దిపేట: సిఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్లు పేదల ఆత్మగౌరవ ప్రతీకలు అని ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు లింగారెడ్డిపల్లిలో నిర్మించిన 25 డబుల్ బెడ్రూం ఇండ్లను హరీష్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. పేదలు ఆత్మ గౌరవంగా బ్రతికేందుకు సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం తెచ్చారని తెలిపారు. లింగారెడ్డిపల్లి గ్రామస్తులు అదృష్టవంతులు.. త్వరలోనే దశ దిశ మారిపోతుందన్నారు. అర్హులైన నిరుపేదలకు మరిన్ని ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. ఇవాళ ఇండ్లు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. లింగారెడ్డిపల్లిలోని ఎల్లమ్మ గుడి నుంచి చిన్న కోడూరు వరకు నాలుగు లేన్ల రోడ్ ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు.