తిరుపతి-ఆదిలాబాద్ ఎక్స్‌ప్రెస్ రైలు 27 నుంచి పునఃప్రారంభం
సికింద్రాబాద్::కరోనా మహమ్మారి మూలంగా గత 10 నెలల కిందట ఆగిపోయిన రైల్లు ఒక్కొక్కటిగా పునఃప్రారంభం అవుతున్నాయి. ఈ క్రమంలో తిరుపతి-ఆదిలాబాద్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నెల 27 తేదీ నుంచి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసును ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలు తిరిగి ఈనెల 27 నుంచి ప్రారంభం కానున్న ది. తిరుపతి నుంచి మల్కాజిగిరి మీదుగా ఆదిలాబాద్ వెళ్లే ఈ రైలు తిరుపతిలో ఉదయం 5.50కి బయలు దేరి మల్కాజిగిరికి రాత్రి 9 గంటలకు చేరుకుంటుంది. ఆదిలాబాద్‌కు మరుసటి రోజు ఉదయం 6.15కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఆదిలాబాద్‌లో రాత్రి 9.05కి బయలు దేరి మల్కాజిగిరికి ఉదయం 5.15కి, తిరుపతికి రాత్రి 9.35కి చేరుకుంటుంది.