తెలంగాణలో కొత్తగా 216 కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 216 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే తాజాగా ఇద్దరు మరణించారు. 168 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ఈ మేరకు శనివారం ఉదయం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,00,933 కు చేరింది. అలాగే 2,97,363 మంది రికవరీ అయ్యారు. తాజా మరణంతో కలిపి ఇప్పటి వరకు 1652 మంది మృతి చెందారు. ప్రస్తుతం 1,918 యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు.