తెలంగాణలో కొత్తగా 337 కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణలో నిన్న (ఆదివారం) రాత్రి 8 గంటల వరకు 37,079 కరోనా టెస్టులు నిర్వహించగా 337 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు సోమవారం ఉదయం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. కాగా తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,03,455కి చేరింది. వీటిలో 2,98,826 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 2,958 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు మరణించారు. తాజా మరణాలతో కలిపి తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1671కి చేరిందని అధికారులు బులిటెన్‌లో వెల్లడించారు.