తెలంగాణలో కొత్తగా 952 కరోనా కేసులు

హైదరాబాద్ఫ తెలంగాణలో నిన్న రాత్రి 8 గంటలవరకు 38,245 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 952 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ ఆరోగ్యశాఖ తాజాగా కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 952 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే నిన్నటి మీద పెరిగినా సరే ఈ సంఖ్య చిన్నడనే చెప్పాలి. ఇక నిన్నటి కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,58,828కి చేరింది.
కరోనా కారణంగా రాష్ట్రంలో ముగ్గురు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 1410కి చేరింది. ఇక రాష్ట్రంలో 2,43,686 మంది కరోనా నుంచి కోలుకోగా, 13,732 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. సోమవారం ఒక్క రోజులో 1,602 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక 11,313 మంది హోం ఐసోలేషన్ లోనే ఉండి చికిత్స పొందుతున్నారు. అయితే రోజూ అరవై వేల దాక కరోన పరీక్షలు చేస్తున్నారు. కానీ కొద్దిర్ రోజుల నుండి ఈ టెస్ట్ ల సంఖ్య బాగా తగ్గించారు. బహుశా ఈ కేసులు తగ్గడానికి ఇది కూడా ఒక కారణం అని చెప్పచ్చు. ఇక నిన్న ఒక్క రోజే 38,245 పరీక్షలు చేయగా, ఇప్పటిదాకా 49,29,974 కరోనా పరీక్షలు చేశారు.