తెలంగాణలో 2 రోజులు వర్ష సూచన!
హైదరాబాద్: వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశముంది. అలాగే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చలి ప్రభావం ఎక్కువవుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు బుధ, గురువారాల్లో రాష్ర్టంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వానలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం కారణంగా బుధవారం ఆదిలాబాద్, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.