దేశంలో కొత్త‌గా 46,951 కరోనా కేసులు

న్యూఢిల్లీ: భార‌త్‌లో క‌రోనా కేసుల మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. దేశ‌వ్యాప్తంగా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అయితే, డిశ్చార్జ్ కేసుల కంటే, పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గ‌త 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11 లక్షల 33 వేల మందికి వైద్యపరీక్షలు నిర్వహించగా 46,951 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఈ మేర‌కు సోమ‌వారం కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వశాఖ క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది. గ‌త 24 గంటల వ్యవధిలో కొత్త‌గా 212 మ‌ర‌ణాలు నమోదయ్యాయి.

తాజా కేసుల‌తో క‌లిపి భార‌త్‌లో ఇప్పటివరకు 1,16,46,081 కేసులు నమోదయ్యాయి. వీరిలో 1,11,51,468 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్ర‌స్తుతం 3,34,646 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 21,180 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యార‌ని అధికారులు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.