దేశంలో మళ్లీ 40 వేల దిగువకు కొత్త కేసులు

92 ల‌క్ష‌ల‌కు చేరువ‌లో క‌రోనా కేసులు

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. దేశంలో క‌రోనా కేసులు కొద్దిగా త‌గ్గాయి. నిన్న 44 వేల‌కుపైగా న‌మోద‌వ‌గా, నేడు 37 వేల‌పైచిలుకు కేసులు వ‌చ్చాయి. ఇది సోమ‌వారం కంటే 13.8 శాత త‌క్కువ అని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ‌శాఖ తెలిపింది. దీంతో మొత్తం క‌రోనా కేసులు 92 ల‌క్ష‌ల‌కు చేరువ‌లో నిలిచాయి.
కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్‌ ప్రకారం.. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 37,975 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. 42,314 మంది కరోనా నుంచి కోలుకోగా… 480 మంది కరోనాతో కన్నుమూశారు. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 91,77,841కు చేరుకోగా.. మృతుల సంఖ్య 1,34,218కు పెరిగింది… ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,38,667 యాక్టివ్‌ కేసులు ఉండగా… ఇప్పటి వరకు కరోనాబారినపడి 86,04,955 మంది పూర్తిస్థాయిలో కోలుకుంటున్నట్టు కరోనా బులెటిన్‌లో పేర్కొంది కేంద్ర ఆరోగ్యశాఖ.

Leave A Reply

Your email address will not be published.