దేశవ్యాప్తంగా సాగుతోన్న భారత్ బంద్

న్యూఢిల్లీ: వ్యవసాయ కొత్త చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న భారత్ బంద్‌కు విపక్షాలు, పలు సంఘాల మద్దతు లభించింది. మూడు వ్యవసాయ చట్టాల రద్దుకు రైతులు పట్టుబడుతున్నారు. వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్‌తో రైతు సంఘాలు “భారత్ బంద్” కు పిలుపునిచ్చాయి. బంద్ కు ప్రధాన విపక్షాలు, కార్మిక సంఘాల మద్దతునిచ్చాయి. అయితే దేశంలో శాంతి, భద్రతల పై రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు చేసింది. ఇక దేశవ్యాప్త నిరసనకు ఇప్పటికే కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, ఆప్, టీఎంసీ, వామపక్షాలు, డీఎంకే, ఆర్జేడీ, ఎన్సీపీ, టీఆర్ఎస్ సహా దాదాపు అన్ని ప్రతిపక్ష పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. బంద్‌లో చురుగ్గా ఆయా పార్టీల కార్యకర్తలు పాలుపంచుకోనున్నారు. బంద్‌లో పాల్గొని, రైతుల న్యాయబద్ధ డిమాండ్లకు మద్దతివ్వాలని దేశ ప్రజలకు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. బంద్‌ను పాటించాలని ఎవరినీ ఒత్తిడి చేయవద్దని, శాంతియుతంగా నిరసన తెలపాలని, అంబులెన్స్‌లు, ఎమర్జెన్సీ సేవలకు మినహాయింపునివ్వాలని రైతు సంఘాలు విజ్ఞప్తి చేశాయి. బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతిభద్రతల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం సూచనలు జారీ చేసింది.
కోవిడ్–19” ముప్పు పొంచి ఉన్న కారణంగా, మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి “కరోనా”నిబంధనలు ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కోరింది. దేశ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేయాలని, శాంతిసామరస్యాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. బంద్ లో స్వచ్ఛందంగా పాల్గొనాలని దేశ ప్రజలకు రైతు సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. సైద్ధాంతిక లక్ష్యం కోసం మంగళవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు.. నాలుగు గంటల పాటు జరిపే బంద్ కు మద్దతు ఇవ్వడం కోసం ఆ నాలుగు గంటల పాటు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని దేశ ప్రజలను రైతు సంఘాలు కోరుతున్నాయి. ఆ నాలుగు గంటల పాటు దుకాణాలను మూసేయాలని వ్యాపారస్తులను కోరాయి రైతు సంఘాలు.