నూతన కార్పొరేటర్లతో మరికాసెపట్లో మంత్రి కేటీఆర్ సమావేశం

హైదరాబాద్: కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇవాళ సమావేశం కానున్నారు. మరికాసెపట్లో (ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు) తెలంగాణ భవన్లో ఈ సమావేశం జరుగనుంది. ఇందులో ప్రజలతో ఎలా మెలగాలనే అంశంపై మంత్రి వారికి దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నెల 1న జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరఫున 55 మంది కార్పొరేటర్లు ఎన్నికయ్యారు.