నేరేడ్ మెట్ లో టిఆర్ ఎస్ విజ‌యం

హైద‌రాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల కౌటింగ్ సందర్భంగా నిలిచిపోయిన నేరేడ్​మెట్ డివిజన్ ఓట్ల లెక్కింపు ఈ ఉదయం 8 గంటలకు మొదలైంది. జీహెచ్‌ఎంసీ ప‌రిధిలోని నేరేడ్‌మెట్‌లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మీనా ఉపేందర్ రెడ్డి 668 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. తాజా విజయంతో జీహెచ్‌ఎంసీలో టీఆర్ఎస్ కార్పొరేటర్ల సంఖ్య 56కు చేరింది.

Leave A Reply

Your email address will not be published.